Breaking News

ఏకంగా వరుస విజయాలు


 ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. పంజాబ్ టీం కెప్టెన్ కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణించి ఎన్నో పరుగులు చేసినప్పటికీ జట్టు ఆటగాళ్లు నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో పంజాబ్ జట్టు వరుసగా ఓటమి చవి చూస్తూ పాయింట్ల పట్టికలో చివరిలో కొనసాగిన విషయం తెలిసిందే. కానీ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.


పంజాబ్ జట్టు ఉన్న జోరుగా చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ప్లే ఆప్ కి అర్హత సాధించడం పక్క అని అర్థమవుతుంది. కాస్త ఆలస్యంగా జోరందుకున్నప్పటికీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మాత్రం ఏకంగా వరుస విజయాలను అందుకుంటుంది.