Breaking News

రాజస్థాన్‌ రాయల్ రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌కు జరిమానా

 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌ స్లో ఓవర్‌ రేట్‌గా రాజస్థాన్‌ రాయల్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. రాయల్స్ తమ 20 ఓవర్ల కోటాను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో మొదటి తప్పుగా జరిమానా విధించారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొదటి నుంచి ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరచడంతో విజయాన్ని అందుకుంది.


మొదట బ్యాట్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌ 47 బంతుల్లో 79 (11 ఫోర్లు, రెండు సిక్సర్లు), తర్వాత బంతితో బూమ్రా రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్‌ తరఫున జోస్ బట్లర్ 70 (44 బంతుల్లో : నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించలేదు. ఇదిలా ఉండగా..


ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు, ఢిల్లీ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌కు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా విధించారు.