Breaking News

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, గవర్నర్ బిఎస్ కోశ్యారీ మధ్య లేఖల యుద్ధంమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, గవర్నర్ బిఎస్ కోశ్యారీ మధ్య లేఖల యుద్ధంలో లౌకికవాదంపై వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రార్థనా స్థలాలను తెరవడంపై ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ రాయగా అందుకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కొవిడ్19 తీవ్రతపై సమీక్ష అనంతరం ప్రార్థనా స్థలాలపై నిర్ణయం తీసుకుంటానని ఉద్ధవ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలను తెరవాలని డిమాండ్ చేస్తూ తన వద్దకు మూడు బృందాలు వచ్చాయని గవర్నర్ ప్రస్తావించగా, ఆ ముగ్గురూ బిజెపి లేదా ఆ పార్టీ మద్దతుదారులేనని ఉద్ధవ్ తన సమాధానంలో గుర్తు చేశారు. అకస్మాత్తుగా సెక్యులర్‌గా ఎప్పుడు మారారు..? అంటూ కోశ్యారీ తన లేఖలో ప్రశ్నించగా, అంతే ఘాటుగా ఉద్ధవ్ బదులి చ్చారు. ప్రార్థనా స్థలాలు తెరిస్తే హిందూత్వవాది, లేదంటే లౌకికవాది అవుతారా అంటూ ఉద్ధవ్ ఎద్దేవా చేశారు. మన రాజ్యాం గపు మూల సిద్ధాంతం లౌకికవాదమని, గవర్నర్‌గా మీరు ప్రమాణం చేసింది కూడా దానిపైనే అంటూ ఉద్ధవ్ గుర్తు చేశారు.