Breaking News

హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్

 

ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ యుగం నడుస్తోంది. కొత్తకొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీదకు వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అటు ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీ అందిస్తూ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా చొరవ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్ తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ మరో మూడు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకునేలా.. సిటీ స్పీడ్ పేరుతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన వేగంతో ఫ్లైఓవర్లు, ఏటవాలు ప్రాంతాల్లో మంచి రైడింగ్ అనుభూతి కలిగించేలా ఈ సిటీ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను రూపొందించారు. సిటీ స్పీడ్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఆప్టిమా ఎక్స్ (Optima-hx), నైక్స్ హెచ్ఎక్స్ (Nyx-hx), ఫోటాన్ హెచ్ఎక్స్ (Photon-hx)ని పరిచయం చేసింది హీరో ఎలక్ట్రిక్. కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ..'' ప్రస్తుతం ఈ-బైక్ మార్కెట్లో తక్కువ ధరకు తక్కువ వేగంతో నడిచే బైక్‌లు, ఎక్కువ ధరకు ఎక్కువ వేగంతో నడిచే బైక్‌లు లభిస్తున్నాయి. దీనిపై ఎంతో కాలం విశ్లేషించిన తర్వాత తక్కువ ధరకే ఎక్కువ వేగంతో నడిచే బైక్‌లను అభివృద్ధి చేశాం. ఈ బైక్‌లు 70 km నుంచి 200 km వరకు ప్రయాణిస్తాయి.