Breaking News

భారత జట్టులోకి ఎంపికవ్వాలి


 ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్‌ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.