Breaking News

ఉగ్రవాద దాడి ఫ్రాన్స్ లో


 గురువారం ఉదయం ఫ్రాన్స్‌ నగరం నీస్‌లో జరిగిన ఉగ్రదాడిలో మగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక వ్యక్తి కత్తితో చర్చిలో ప్రవేశించి ఒక మహిళ గొంతు కోసి చంపేశాడనీ, మరో ఇద్దరు ఈ దాడిలో చనిపోయారనిపోలీసు అధికారులు తెలిపారు. దీన్ని తీవ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఉగ్రవాద దాడితో ఉలిక్కి పడిన ఫ్రెంచ్‌ ప్రభుత్వం దేశ వ్యాపితంగా హై అలర్ట్‌ను ప్రకటించింది. ఫ్రెంచ్‌ ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ ఒక ప్రకటన చేస్తూ గురువారం నాటి దాడి నేపథ్యంలో భద్రతకు సంబంధించిన నిఘా పెంచుతున్నామన్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులు కాల్పుల్లో చనిపోయినట్టు ఫ్రెంచ్‌ మీడియా తెలిపింది. ఇది ఉగ్రవాద చర్యేనేని నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్ట్రోసి పేర్కొన్నారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని, దాడి చేసిన వ్యక్తి ఒక మతానికి సంబంధించిన నినాదాలు ఇచ్చారని అన్నారు . మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్‌గా భావిస్తున్నట్టు మేయర్‌తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారనీ, వెంటనే ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళారని ఆ వ్యక్తి జీవించే వున్నాడని మేయర్‌ విలేకర్లకు తెలిపారు.

''జరిగిందేదో జరిగింది, మన భూభాగం నుంచి ఇస్లాం ఫాసిజాన్ని పారదోలేందుకు ఫ్రాన్స్‌ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.'' అన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. టీచర్‌ శామ్యూల్‌ పాటీ హత్యకు, నీస్‌ చర్చిపై దాడికి సారూప్యతలున్నాయని అధికారులు తెలిపారు.ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండోసారి. నీస్‌ చర్చి ఘటనపై ఫ్రాన్స్‌ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్‌ విభాగం దర్యాప్తు చేపట్టింది. గురువారం నాటి దాడికి మహ్మద్‌ ప్రవక్త కార్టూన్లకు ఏమైనా సంబంధమందా లేదా అన్నది వెంటనే తెలియరాలేదు. తన విద్యార్థులకు మహ్మద్‌ ప్రవక్తపై గీచిన కార్టూన్లను చూపిన ఫ్రెంచ్‌ మిడిల్‌ స్కూల్‌ టీచర్‌ ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే.