Breaking News

నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అధికార పార్టీని పప్పూసేన అని విమర్శించారు. కంగనా రనౌత్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత కంగన తొలిసారి స్పందించారు.