Breaking News

తమలపాకు తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ..?

 


ప్రతి శుభకార్యాలలో, విందు వినోదాలలో ఆకు వక్క, కిల్లి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది అని మీకు తెలుసా..? వాస్తవానికి తమలపాకుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు తమలపాకులను తరుచుగా తీసుకునేవారు. అయితే ప్రస్తుత కాలంలో ఆకు ఒక అనే మాట ఎక్కడా కూడా వినబడటం లేదు. ఇందుకు ముఖ్య కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. కొన్ని అపోహల వల్ల తమలపాకును తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలవడంతో తాను తినడం చాలావరకు తగ్గించేశారు.  మన భారతదేశంలో అనాది కాలం నుంచి తమలపాకులు తినడం వంటి వారిని చూస్తూనే ఉంటాము. ఇక అంతేకాకుండా తమలపాకులను శుభప్రదంగా భావించి పూజా కార్యక్రమాలలో కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. తమలపాకు తినడం వల్ల మనకి విటమిన్ సి, రైబోఫ్లెవిన్, విటమిన్ A పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో కాల్షియం ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ నిరోధక లక్షణాలు, డయాబెటిస్ ను కంట్రోల్ చేయగలవు. రక్తపోటు నివారణ లో కూడా తమలపాకులు ఒక కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో కూడా శాస్త్రవేత్తలు తెలియజేశారు. మునుపటి కాలంలో వైద్యంలో మంట, ఉబ్బసం వంటి వ్యాధులను నివారించేందుకు ముఖ్య పాత్ర వహించింది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడిని తగ్గించడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.  తమలపాకులు తీసుకోవడం ద్వారా హానికరమైన ప్రభావాలు కలిగిస్తాయని ఎక్కడా కూడా మనకు రచించలేదు, అలాగే ఎక్కడ కూడా రుచించలేదు. అందుకే కాబోలు ఇదివరకు కాలంలో పెద్దలు అనేక మంది ఆకులు వేసుకునేవారు. ఇకపోతే ఆయుర్వేద గ్రంథాల్లో కూడా తమలపాకు తినే విషయంలో కొన్ని పద్ధతులు రాసి ఉండటం విశేషమే. వీటిని తీసుకోవడం వల్ల తమలపాకు లో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక నిరోధక సమ్మేళనాలు లభిస్తాయి.