Breaking News

కృష్ణానదిలో భారీ కొండచిలువకృష్ణానదిలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు చేపలు పడుతుండగా వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. వలను బయటకు లాగిన తర్వాత చూడగా చేపలతో పాటు భారీగా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.