Breaking News

విజయవంతంగా మరో డీఆర్‌డీవో క్షిపణి పరీక్ష!

 


భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకుపోతున్నది. తాజాగా మరో క్షిపణిని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (SANT) మిస్సైల్‌ను ఒడిశా తీరం నుంచి ప్రయోగించి పరీక్షను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసింది. డీఆర్‌డీవో ఈ క్షిపణిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం అభివృద్ధి చేసింది. లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్, లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ సామర్థ్యాలు కలిగి ఉండటం ఈ క్షిపణి ప్రత్యేకత అని డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి.