Breaking News

భారీ భూకంపంతో టర్కీ, గ్రీస్‌


 భారీ భూకంపంతో టర్కీ, గ్రీస్‌ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది. ఈ భూకంపంతో ఇజ్మీర్ తీరప్రాంతంలోని నగరంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అయితే టర్కీ (Turkey Earthquake) లోని ఇజ్మీర్ నగరంలో ( Izmir city ) కుప్పకూలిన భవనాల కింద వేలాది మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు.

శిథిలాలను తోలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిరాంతరాయంగా జరుగుతోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు 17 మంది మరణించారని, 709 మంది గాయపడ్డారని టర్కీ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. కుప్పకూలిన 17 భవనాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు.