Breaking News

నాలుగో విజయం కింగ్స్‌ ఎలెవన్


 ఆంధ్ర టి20 లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్‌ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్‌ జట్టు బౌలర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మాŠయ్‌చ్‌' పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్‌ జట్టులో రషీద్‌ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్‌ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.