Breaking News

ట్రంప్ దంపతులకు కరోనా.. అమెరికా అధికారుల్లో టెన్షన్


అమెరికా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కూడా వైరస్ సోకింది. ఆయనే ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. శుక్రవారం చేసిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. తామిద్ధరం హోం క్వారంటైన్‌లోనే జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపారు. దీంతో వైట్ హౌజ్ సిబ్బందితో పాటు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఆయన్ను ఇటీవల కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుంటున్నారు.

ట్రంప్ ప్రధాన సహాయకురాలు హోప్ హిక్స్ వ్యాధిబారిన పడ్డారు. నిత్యం సన్నిహితంగా ఉండటంతో ట్రంప్‌ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది. అనేక ప్రచారా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ గత్యంతరం లేక వాటిని వాయిదా వేసుకున్నారు. మరోవైపు అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి.