Breaking News

మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ మూవీ ఓపెనింగ్..

 


మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపి మలినేని డైరెక్షన్లో క్రాక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఖిలాడీ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు ఆదివారం ఉదయం హైదరాబాద్ లో జరిగాయి.  రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా "ఖిలాడి సినిమా ఫస్ట్‌లుక్‌. మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది" అని రవితేజ అన్నారు. "నా తదుపరి చిత్రం మాస్‌ మహారాజా రవితేజతో ఖిలాడి. సరికొత్త పాత్రలో కనిపించనున్నాం. గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. మీ ఆశీర్వాదాలు కావాలి" అని డింపుల్‌ హయతి అన్నారు. "ఖిలాడిలో ఇప్పటి వరకు కనిపించని రవితేజను చూస్తారు. అద్వితీయమైన టాలెంట్‌ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు" కావాలంటూ డైరెక్టర్‌ ట్వీట్‌ చేశారు.  . డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.