Breaking News

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) లో కొలువుల జాతర



గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు మెల్లగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపార సంస్థలు కొత్త నియామకాల మీద దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత్ లో సర్వీస్ సెక్టార్ లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) లోనూ కొలువుల జాతర షురూ అయింది. కరోనా కేసులు తగ్గుతుండటం.. జనాల్లోనూ దానిపై అంత ప్రభావం లేకపోవడం తో ఆర్థిక కార్యకలాపాలూ జోరందుకోవడంతో ఐటీ సంస్థలు నియామకాల బాట పట్టాయి.   ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు కొద్దిరోజులుగా ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగాన్ని పెంచుతున్నాయి. గడిచిన త్రైమాసికంలో ఈ మూడు సంస్థలు గణనీయంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయని వారి ఉద్యోగుల సంఖ్యను చూస్తేనే తెలుస్తున్నది. ఈ ఏడాది జూన్ 30 నుంచి గతనెల (సెప్టెంబర్ 30) దాకా టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) దాదాపు పదివేల మంది ఉద్యోగులను నియమించుకుంది. జూన్ 30 న వారి మొత్తం ఉద్యోగులు 4,43,676 మంది ఉండగా.. గతనెల 30 నాటికి ఆ సంఖ్య 4,53,540కి చేరింది.