Breaking News

అఫ్గాన్ క్రికెటర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం!


అఫ్గానిస్థాన్ యువ క్రికెటర్ నజీమ్ తరకై ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను గత 22 గంటలుగా కోమాలోనే ఉన్నాడని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ మీడియా మేనేజర్ ఇబ్రహీమ్ మొమంద్ ట్వీట్ చేశారు. నజీమ్‌కు ఇంకా చికిత్స అందిస్తున్నారని తెలిపారు. జలాబాద్ సిటీలో నజీమ్‌ను కారు ఢీకొట్టిందని, వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

'రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నజీమ్ గత 22 గంటలుగా కనీసం కదలడం లేదు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. జలాబాద్ సిటీలో అతన్ని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం అతన్ని వెంటనే కాబుల్ లేదా పొరుగు దేశాల్లోని ఆసుపత్రికి తరలించాలని అభిమానులు అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ)ని డిమాండ్ చేస్తున్నారు'అని ఇబ్రహీమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక అంతర్జాతీయ వన్డే ఆడిన నజీమ్.. 12 టీ20ల్లో 21 సగటుతో 258 పరుగులు చేశాడు.