Breaking News

హథ్రాస్‌ ఘటనపై దర్యాప్తును సిబిఐ ఇకపై వేగవంతం



ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సఅష్టించిన హథ్రాస్‌ ఘటనపై దర్యాప్తును సిబిఐ చేపట్టనుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో పాటు అలహాబాద్‌ హైకోర్టుకూడా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో యుపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. యుపి పోలీసుల నుండి హథ్రాస్‌ కేసు దర్యాప్తును సిబిఐ నేడు స్వీకరించింది. 19 ఏళ్ల దళిత యువతిపై అగ్ర కులాలకు చెందిన నలుగురు వ్యక్తులు సెప్టెంబరు 14న అత్యంత పాశవికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన యువతి ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్థరాత్రి అంత్యక్రియలు చేశారు. ఈ కేసులో పోలీసుల వైఖరిపై కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. హథ్రాస్‌ ఘటన అనంతరం కూడా యుపిలో పలు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో యుపిలో మహిళల భద్రతపై ఆందోళన నెలకొంది.