Breaking News

యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...


 ప్రీమియం ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తన యూజర్లకు పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న యాప్స్, ఇన్- యాప్ కొనుగోళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారతదేశంతో సహా బ్రెజిల్, కొలంబియా, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ పెంపు అమల్లోకి రానుందని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఉన్న విధంగానే యాపిల్ ఐఫోన్లకు కూడా ప్రత్యేకంగా యాప్స్ అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్ ఎలాగైతే ఉంటుందో, ఐఫోన్ యూజర్లకు యాపిల్ ప్లేస్టోర్ అలాగే ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల లాగా యాపిల్ యూజర్లకు చాలా యాప్స్ ఉచితంగా లభించవు.