Breaking News

ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట



ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆస్తుల కేసును ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే వారి లాయర్లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా, శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కోర్టులో నమోదైన కేసుల విచారణ శుక్రవారం జరిగింది. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, ఇతర నిందితుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు అంగీకరించారు. ఈ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.