Breaking News

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో జాబ్స్ : ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల


నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. ఘజియాబాద్ యూనిట్ లో 10 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ANTENNA, SCCS, RADAR విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు 3 నుంచి ఐదేళ్ల వరకు విధులు నిర్వర్తించనున్నారు. వారికి రూ. 30 వేల నుంచి రూ. 1.20 లక్షల వేతనం చెల్లించనున్నారు.

ANTENNA విభాగంలో రెండు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడేళ్ల డిప్లమో కోర్సులో మొదటి తరగతిలో పాసైన వారు లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో 15 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. SCCS విభాగంలో ఆరు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మూడేళ్ల డిప్లొమో లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన సిగ్నల్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్ కోర్సుల్లో ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నావీ సర్టిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూసుకోవచ్చు.

RADAR విభాగంలో రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్ లో మూడేళ్ల డిప్లొమో లేదా అందుకు సమానమైన విద్యార్హత ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ ఈ నెల 24. దరఖాస్తులను సూచించిన పద్ధతిలో పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను ఈ నెల 27లోపు పంపించాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.