Breaking News

అమ్మకానికి ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు ..

ఏపీఎస్ఆర్టీసీ... ఆర్థికంగా వెనుకబడిన ఆర్టీసీని ఆదుకోవడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ఆదాయవనరులు పెంచడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతకుముందే ఆర్థిక నష్టాలలో ఉన్న ఆర్టిసి ఇప్పుడు కరోనా కారణంగా పీకల్లోతు నష్టాల్లోకి, కష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో రెగ్యులర్ గా వచ్చే ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఇక అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడంతో తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ బస్సు సర్వీసుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం లేకుండా పోయింది.A

ఈ క్రమంలో ఆర్టీసీని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం ఎలా ఆలోచిస్తున్న సర్కార్ ఆ దిశగా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ సొంత స్థలాలను సర్వే చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆర్టీసీ స్థలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆర్టీసీ ఉన్న స్థలాలను సర్వే చేసి వాటిని ఏవిధంగా వినియోగించుకోవచ్చు అనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించనుంది.

ముఖ్యంగా గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలలో అక్రమాలు జరిగాయని సర్కార్ భావిస్తోంది. ఒకవైపు ఆర్టీసీ భూముల సర్వే చేపడుతూ, ఆర్టీసీ ఆదాయవనరులు పెంచే ఆలోచన చేస్తూనే, మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ పైన కూడా దృష్టి పెట్టటం ఆందోళన కలిగిస్తుంది .