Breaking News

ఫెస్టివల్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా?


 ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? అయితే జాగ్రత్త. ఆఫర్లు, డిస్కౌంట్లు బాగా ఉన్నాయి కదా అని హడావుడిగా ఆర్డర్స్ చేయకండి. ఓసారి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయడం మంచిది. లేకపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఏదైనా ప్రొడక్ట్స్ కొనే ముందు డిస్కౌంట్ ధరల్ని సరిగ్గా చెక్ చేయండి. కొన్ని డిస్కౌంట్స్ కొంత సమయం వరకు మాత్రమే ఉంటాయి. అందుకే నియమనిబంధనలన్నీ చదివి ఆఫర్స్ గురించి అవగాహన పెంచుకోండి. ఆ తర్వాతే ఆర్డర్ చేయండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ లాంటి బ్యాంకుల కార్డులు వాడితే డిస్కౌంట్ వస్తుంది. ఆ సేల్ సమయంలో ఏ కార్డు వాడితే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి.