Breaking News

గాంధీ గ్లోబల్ సంస్థల క్రీడా విభాగంలో నియామకాలు




గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలోని నల్లగొండ జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాధ్యుల  నియామకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి హాజరై నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక అశోక గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లో గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గాంధీ సంస్థలు క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడం లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ స్వచ్ఛందంగా క్రీడా సేవ చేస్తున్న వారిని సంస్థలు గుర్తించి వారికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారాలు కూడా అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గున్న విజయలక్ష్మి, సంస్థల ప్రధానకార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి అశోక్ ముదిరాజ్, జి జి ఎఫ్ సుస్థిర క్రీడల రాష్ట్ర కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, తరి మధు తదితరులు పాల్గొన్నారు.

మహిళా క్రీడల విభాగం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంధం శైలజ

(మిర్యాలగూడ) ఉపాధ్యక్షురాలిగా వడ్డెబోయిన నాగజ్యోతి( నల్గొండ మహిళా జాయింట్ సెక్రటరీలుగా కొనకంచి గీత (త్రిపురారం) పాల్వాయి శ్రావణి (నల్గొండ)మరియు జాయింట్ సెక్రటరీగా రుద్రాక్షి మహేష్ (దుగ్గేపల్లి)   బాధ్యతలు స్వీకరించారు.