Breaking News

మహమ్మారి విషయంలో దేశంలో రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్



అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేసినప్పటికీ.. కొత్త కరోనా కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. అంతేగాక, రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.గత 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75,517 నమూనాలను పరీక్షించగా 5210 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 30 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.జిల్లాల వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, అనంతపురం, కృష్ణాలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6224కి చేరింది.
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 165, చిత్తూరులో 412, తూర్పుగోదావరిలో 208, గుంటూరులో 348, కడపలో 174, కృష్ణాలో 388, కర్నూలులో 124, నెల్లూరులో 219, ప్రకాశంలో 230, శ్రీకాకుళంలో165, విశాఖపట్నంలో 96, విజయనగరంలో 90, పశ్చిమగోదావరిలో 327 కేసులు నమోదయ్యాయి.