Breaking News

PUBG మీద భారీ సైబర్ దాడి.. DDoS అటాక్ తీవ్ర ప్రభావం!


PUBGని మొబైల్ గేమ్ ఇండియాలో నిషేధించినప్పటికీ, డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో దానిని ఇంకా ఆడుకునే అవకాశం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ సర్వర్ మీద తాజాగా భారీ గా డిస్ట్రిబ్యూటర్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) అటాక్ చోటు చేసుకుంది.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆ సంస్థ ట్విట్టర్ మరియు ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టింది. "మా సర్వర్ మీద పలు దశల్లో DDoS అటాక్ జరుపబడింది. ఈ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ ఆడుతున్న అనేకమంది ప్లేయర్లు సర్వర్ నుండి డిస్కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లతో సంప్రదింపులు జరుపుతున్నాం. సాధ్యమైనంత త్వరగా మా గేమ్ ఆడుతున్న ప్లేయర్లకు సాధారణ స్థితి అందించే ప్రయత్నం చేస్తున్నాం" అంటూ ఆ సంస్థ స్పందించింది.
చైనాకు చెందిన Tencent సంస్థ తో భాగస్వామ్యం కలిగి ఉన్నందు వలన ఇటీవల మన దేశంలో నిషేధించబడిన ఈ గేమ్ ఎలాగైనా భారతీయ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించటానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా కోట్లాది మంది భారతీయులు గత కొన్ని ఏళ్లుగా PUBGకి అడిక్ట్ అయ్యారు అనడంలో సందేహమే లేదు. దీంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో యూసర్ బేస్‌ని ఈ సంస్థ కోల్పోయినట్లు అయింది. అందుకే Reliance Jio భాగస్వామ్యంతో ఇండియాలో ప్రవేశించడానికి కూడా ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి.

అయితే కొంతమంది PUBG వెబ్సైట్ నుంచి నేరుగా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆడుకుంటున్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు PUBG మొబైల్ సర్వర్ కి కనెక్టివిటీ నిలిపి వేయకపోవడం వల్ల ఇది సాధ్యపడుతోంది. అయితే ఎవరైతే అటు డెస్క్టాప్ గాని లేదా సైడ్ లోడ్ చేసి మొబైల్ లో గాని ఈ గేమ్ ఆడుతున్నారో కొద్ది గంటలు వేచి ఉండక తప్పని పరిస్థితి. DDoS అటాక్ కారణంగా మరికొంత సమయం గేమ్ ఆడటం సాధ్యపడదు