Breaking News

Vodafone, Idea వినియోగదారులకు శుభవార్త. భారీ డేటా ప్రయోజనాలతో కొత్త ప్లాన్


Vodafone, Idea వినియోగదారులకు శుభవార్త. రెండు సంవత్సరాలు పూర్తి స్థాయిలో విలీనం పూర్తి అయిన తర్వాత తన వినియోగదారులను కాపాడుకోవడం కోసం ఆ సంస్థ ఇటీవల కాలంలో అనేక కొత్త ప్లాన్స్ తీసుకు వస్తోంది.

అందులో భాగంగా తాజాగా వర్క్ ఫ్రం హోం ప్రొఫెషనల్స్, విద్యార్థులు మరియు, క్రికెట్ అభిమానులందరి దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండి మొత్తం 100 జీబీ మొబైల్ డేటా అందించే విధంగా 351 రూపాయల విలువ కలిగిన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా ఇవ్వబడే 100 జీబీ డేటాను 56 రోజుల్లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. రోజువారీ పరిమితి ఎలాంటిదీ ఉండదు.

ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం Vodafone Idea గత త్రైమాసికంలో గణనీయంగా వినియోగదారుల సంఖ్యను కోల్పోయింది. దానిని సరి చేసుకోవడానికి ఇటీవల Vi సంస్థ మరింత మెరుగైన 4G స్పీడ్ వచ్చే విధంగా కొత్త టెక్నాలజీని కూడా ప్రకటించింది. ఇటీవల ఒకదాని తర్వాత మరొకటి అనేక సరికొత్త ప్లాన్స్ కూడా ఆ సంస్థ తీసుకొచ్చింది. వాటిలో అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు 355, 405, 595, 795, 2595 రూపాయల విలువ కలిగిన మొత్తం 5 ప్లాన్స్ ఈ సంస్థ ద్వారా యూజర్లకు కొత్తగా వచ్చాయి.

కేవలం డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ఈ ప్లాన్స్ ద్వారా వరుసబెట్టి 28, 56, 84, 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండే విధంగా Zee5 ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. వీటితో పాటు 49, 69, 99, 249 రూపాయల విలువ కలిగిన స్పెషల్ ప్యాక్స్ కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే మరోవైపు అతి త్వరలో తన పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ వినియోగదారులకు టారిఫ్ పెంచే ఆలోచనలో Vodafone Idea సంస్థ ఉంది.