Breaking News

Whatsapp Beta లేటెస్ట్ వెర్షన్


 Whatsapp ఒకపక్క ఆండ్రాయిడ్ మరియు మరోపక్క iOS ఆపరేటింగ్ సిస్టం కోసం అప్పుడప్పుడు అనేక కొత్త సదుపాయాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫైనల్ వెర్షన్ కోసం వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే ముందు Beta వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు మొట్టమొదట అవి అందించబడతాయి. ఈ నేపథ్యంలో తాజాగా iOS ఆధారంగా పనిచేసే డివైస్ లు వాడుతూ Whatapp Beta ఉపయోగిస్తున్న వారికి కొత్తగా beta వెర్షన్ అందించబడింది.

2.20.120.17 అనే ఈ వెర్షన్‌లో అంతర్గతంగా ప్రధానంగా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. Whatsapp సంస్థ Whatsapp Web/Desktopలను ఉపయోగించడం కోసం ఇప్పటివరకు అందిస్తున్న ఇంటర్ఫేస్ కాకుండా, సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్ ప్రవేశపెట్టింది.