Breaking News

కవిత కు శుభాకాంక్షలు తెలిపిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి

 

నిజామాబాదు నుండి శాసనమండలి కి భారీ మెజారిటీతో గెలుపొందిన కల్వకుంట్ల కవిత గారికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి , గాంధీ సంస్థ సభ్యులు  వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గున్నా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రజలకు చేసిన సేవలు ఈ భారీ మెజారిటీ రావడానికి కారణమైందని అన్నారు. గాంధీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా అధ్యక్షులుగా బాధ్యత  ఉన్న కవిత గారిని అక్టోబర్ 30న వినోబా నగర్ లో జరిగే గ్రామ నిర్మాతల రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, పాముల అశోక్ ముదిరాజ్, నల్గొండ జిల్లా జాగృతి అధ్యక్షులు బోనగిరి దేవేందర్, గుండాల గోవర్ధన్, దశరధ గౌడ్, డాక్టర్ మైనేని వాణి, జింకల హరి ప్రసాద్ ముదిరాజ్, ఎడవెల్లి శంకర్, ఎస్ ఆర్ వెంకన్న, శివ తదితరులు పాల్గొన్నారు.