Breaking News

చార్జీలను 15 శాతం నుంచి 20 శాతం పెంచాలని వొడాఫోన్‌ ఐడియా భావిస్తోంది.


 వచ్చే నెలలోగా చార్జీలను 15 శాతం నుంచి 20 శాతం పెంచాలని వొడాఫోన్‌ ఐడియా భావిస్తోంది. ఒకవైపు తన లాభదాయకత పెంచుకోవడంతో పాటు కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. వొడాఫోన్‌ పెంచితే..ఆ వెంటనే చార్జీలు పెంచేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధంగా ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాము విధిస్తున్న చార్జీలు చాలా తక్కువని కంపెనీ అంటోంది. ఒక్కో కస్టమర్‌ నుంచి వొడాఫోన్ పొందుతున్న సగటు రెవెన్యూ రూ. 119 కాగా, ఎయిర్‌టెల్‌ రూ. 162 సాధిస్తోంది. రిలయన్స జియో సగటు వినియోగదారుని నుంచి ఆదాయం రూ. 145గా ఉంది.