Breaking News

దేశంలోనే నెంబర్ 2 హైదరాబాద్ మెట్రో


 దేశంలో మెట్రో రైలు పట్ల ప్రయాణీకుల్లో ఆదరణ పెరుగుతోంది. పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూఢిల్లీ మెట్రోరైలు సహజంగానే దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన మెట్రో కాగా.. కేవలం మూడేళ్ళ క్రితం ప్రారంభమైన హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో వుంది. దేశంలో ప్రజాదరణ, ప్రయాణీకుల ఆదరణలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో స్థానానికి చేరింది. దేశంలో మెట్రో రైలు ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది.దేశంలో మెట్రో రైలు ముందుగా న్యూఢిల్లీలో అరంగేట్రం చేసింది. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమయ్యే మెట్రో రైలు దేశంలోనే అత్యంత లగ్జరియస్ మెట్రో రైలుగా పేరుగాంచింది. అయితే.. న్యూఢిల్లీ మెట్రో ఇపుడు మహానగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మొత్తం 8 ప్రధాన రూట్లతోపాటు పలు లింకు రూట్లతో ఢిల్లీ మెట్రో నగరంలో ప్రజల ప్రయాణానికి ప్రధాన విభాగంగా మారిపోయింది.