Breaking News

2 కోట్ల మంది డేటా చోరీ:


 కాయగూరలు, ఇంటి సరుకులు సరఫరా చేసే ఆన్‌లైన్‌ సంస్థ బిగ్‌ బాస్కెట్‌కు చెందిన దాదాపు 2 కోట్ల మంది డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. సైబల్‌ అనే ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని బయట పెట్టింది. చోరికి సంబంధించి బెంగళూరులోని సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు బిగ్‌బాస్కెట్‌ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్కెట్‌కు సంబంధించిన దాదాపు 2 కోట్ల మంది డేటాను డార్క్‌నెట్‌లో అమ్మకానికి పెట్టినట్లు కొన్ని సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. ఈ డేటాకు రూ. 30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు ఇవి పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో నమోదు చేసుకున్న వ్యక్తుల పేర్లు, వారి ఈమెయిల్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌ హ్యాషెస్‌, కాంటక్ట్‌ నంబర్లు, అడ్రస్‌లు, పుట్టిన రోజు తేదీ, నివాసం, లాగిన్‌ అడ్రస్‌లను కూడా అమ్మకానికి పెట్టినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సైబిల్‌ తన బ్లాగ్‌లో రాసింది.

అక్టోబర్‌ 30న ఈ చోరి జరిగినట్లు తమకు తెలిసిందని, దీని గురించి బిగ్‌ బాస్కెట్‌ కంపెనీకి తాము సమాచారం అందించామని సైబల్‌ వెల్లడించింది. దీనిపై బిగ్‌బాస్కెట్‌ స్పందిస్తూ. క్రెడిట్ కార్డు నంబర్లు వంటి ఫైనాన్సియల్‌ డేటా సురక్షితంగా ఉందని పేర్కొంది. కేవలం కస్టమర్‌ డేటా మాత్రమే చోరీ జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపింది.