Breaking News

వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం


 అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరంలోని వరద బాధితుల కోసం మై హోం సంస్థ గత నెలలో భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి 5 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇస్తున్నట్లు మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు అప్పుడు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేట్ సిటిజన్‌‌గా తన వంతు బాధ్యతతో ఈ విరాళం ఇస్తున్నట్లు రామేశ్వర్ రావు తెలిపారు. తాజాగా అందుకు సబంధించిన చెక్‌ను జూపల్లి రామేశ్వర్ రావు తనయుడు రాము సీఎం కేసీఆర్‌కు అందజేశారు.