Breaking News

వ్యాక్సిన్‌ 90శాతం ప్రభావవంతంగా...


 కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై తయారీ సంస్థలు పరిశోధనలు కొనసాగుతుంటే.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. సురక్షిత, సమర్థత కలిగిన వ్యాక్సిన్‌ను అందించడంలో కీలక దశను పూర్తి చేసుకున్న ట్టు ఫైజర్‌ యాజమాన్యం పేర్కొంది. అత్యవసర వినియోగం కోసం నియంత్రణ సంస్థలకు అవసరమయ్యే సమాచారాన్ని విశ్లేషించామనీ, వ్యాక్సిన్‌ అనుమతికి మార్గం సుగమం చేయడంలో తాజా ఫలితాలు దోహదపడతాయని సంస్థ అభిప్రాయపడింది. ఒకవేళ ఈప్రక్రియ వేగం గాపూర్తయితే, త్వరలోనే అమెరికాలోవ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నది.