Breaking News

గోటూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం


 కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్, స్కార్పియో, మరో కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కడప – తాడిపత్రి రహదారిపై గోటూరు – తోళ్ల గంగన్న పల్లె మధ్యలో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతి చెందిన నలుగురు తమిళనాడుకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే ఈ స్కార్పియోలో తెల్లవారుజామున అక్రమంగా ఎర్రచందనం దుంగలును తరలిస్తున్నారు. ఈమంటల్లో ఎర్రచందనం దుంగలు, టిప్పర్, స్కార్పియో, కారు మూడూ మంటలకు ఆహుతి ఆయ్యాయి. కార్లో ఉన్న ముగ్గురుకి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేశారు. ఘటన స్థలాన్ని స్థానిక సిఐ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.