Breaking News

కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులు


 బాలుడు గౌతమ్ కిడ్నాప్‌ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సూర్యాపేట పోలీసులు బాలుడిని తండ్రి చెంతకు చేర్చారు. 24 గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్‌ను పోలీసులు ఛేదించారు.

బాలుడితో సూర్యాపేటకు బాలుడి తండ్రితో పాటు పోలీసులు కూడా బయల్దేరారు. ఆ 24 గంటలు బాలుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు కిడ్నాప్ చేశారు అనే విషయాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.

శనివారం రాత్రి బాణసంచా కోసం వెళ్లి బాలుడు గౌతమ్ ఇంటికి తిరిగి రాలేదు. సూర్యాపేటలో బాలుడు అదృశ్యం కేసులో బాబు కర్నూలులో ఉన్నాడంటూ సమాచారమందించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సమాచారాన్ని బాలుడి ఇంటి వద్ద ఉన్న టైలర్‌కు ఫోన్‌ చేసి తెలిపారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కాల్ చేసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేశారు. సూర్యాపేటలోని భగత్‌సింగ్‌ నగర్‌లో గౌతమ్‌ అనే బాలుడు నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు.

నిన్న రాత్రి బాణసంచా కోసం వెళ్లిన గౌతమ్‌. ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు గాలించగా. బాణసంచా షాపు సమీపంలో గౌతమ్‌ సైకిల్‌ లభ్యమైంది.

చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా గౌతమ్‌ ఆచూకీ దొరక్కపోవడంతో. అతడి తల్లిదండ్రులు సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌతమ్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అసలు గౌతమ్‌ బాణాసంచా షాప్‌ నుంచి ఎలా మిస్సయ్యాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే సూర్యపేట బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు.