Breaking News

శనగపిండి,పసుపు పొడి మాస్క్ తెల్లగా అవుతారు


 తెల్లగా, అందంగా వుండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ పద్ధతులు పాటించండి. తెల్లగా అవుతారు. శనగపిండి,పసుపు పొడి మాస్క్ ఇది చర్మం తెల్లబడటానికి మరియు గుర్తులను తొలగించటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ తయారుచేయటం చాలా సులభం. రెండు స్పూన్స్ శనగపిండిలో చిటికెడు పసుపు,ఒక స్పూన్ నిమ్మరసం లేదా పెరుగు ను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిముషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేయాలి. పాలు, తేనె మరియు నిమ్మ రసం మీ చర్మం తెల్లబడటానికి ఇది ఒక సులభమైన ప్యాక్. ఒక స్పూన్ పాలు,తేనె మరియు నిమ్మ రసం తీసుకోని మృదువుగా పేస్ట్ చేయండి.

దీనిని మీ ముఖానికి,మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు-మూడు సార్లు చేస్తే,మీ చర్మం మీద అన్ని రకాల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

ఓట్ మీల్, పెరుగు మరియు టమోటో మాస్క్ ఒక గిన్నెలో ఒక స్పూన్ ఓట్ మీల్,పెరుగు మరియు టమోటో రసం తీసుకోని బాగా కలపాలి. మీ ముఖం,మెడకు బాగా పట్టించి 20 నిముషాల తర్వాత సాధారణ నీటి తో శుభ్రం చేయాలి. టమోటా రసం ఒక మంచి రక్తస్రావ నివారిణి అని పిలుస్తారు. అందువల్ల సహజంగా చర్మానికి అందాన్ని ఇస్తుంది. ఓట్ మీల్ సహజంగా మరియు శాంతముగా చర్మం ఎక్స్ ఫ్లోటింగ్ లో సహాయపడుతుంది.పెరుగు తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి చర్మ దోషాన్ని తొలగిస్తుంది. ఈ మాస్క్ ను స్క్రబ్ తో కూడా శుభ్రం చేయవచ్చు. ఈ మాస్క్ చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. అలాగే సన్ తాన్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మరసం మరియు దోసకాయ రసం మాస్క్ నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తగ్గిస్తుంది.

ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ దోసకాయ రసం తీసుకోని బాగా కలిపి ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. దోసకాయ మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది వేసవికాలం కోసం ఒక మంచి పరిపూర్ణమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. హనీ మరియు బాదం మాస్క్ హనీ మరియు బాదం సన్ తాన్ తొలగించటానికి మరియు చర్మం తెల్లబడటం కోసం ఒక మంచి ఇంటి ప్యాక్ అని చెప్పవచ్చు. తేనె మరియు బాదం రెండు కలిసి చర్మాన్ని తెల్లపరచటానికి అద్భుతంగా పనిచేస్తాయి. అవి చర్మం యొక్క తేమను అలాగే ఉంచి సన్ తాన్ ను తొలగిస్తుంది. మీరు సులభంగా ఈ మాస్క్ ను తయారుచేయవచ్చు.