Breaking News

రజిని బయోపిక్..


 సూపర్ స్టార్ రజినికాంత్ జీవిత కథతో ఓ సినిమా వస్తుందని కోలీవుడ్ మీడియా టాక్. బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఇలాంటి టైం లో రజిని బయోపిక్ క్రేజీగా మారుతుంది. కోలీవుడ్ డైరక్టర్ లింగుసామి ఈ బయోపిక్ డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. ఇంతకీ తెర మీద రజినిలా కనిపించే ఛాన్స్ ఎవరికి ఉంది అంటే.. ఇంకెవరు ఆయన అల్లుడు తమిళ స్టార్ హీరో ధనుష్ అని అంటున్నారు.


తమిళ క్రేజీ హీరోగా ఎలాంట్ పాత్రకైనా తన మార్క్ చూపించి ప్రాణం పోసే ధనుష్ రజినికాంత్ అల్లుడుగా కాదు సోలోగా తన స్టార్ డం ఏంటన్నది చూపిస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ పై తన సత్తా చాటుతున్నాడు ధనుష్. అందుకే సౌత్ హీరోల్లో ఆయన చాలా ప్రత్యేకం.

ఇక ఇప్పుడు రజినికాంత్ బయోపిక్ లో నటిస్తున్నాడని తెలిసి ధనుష్ మీద ఇంకాస్త హోప్ ఏర్పడింది.

రజిని బయోపిక్ కు ఆయనే పర్ఫెక్ట్. తప్పకుండా రజిని జీవితాన్ని తెర మీద ఆవిష్కరించడానికి ధనుష్ సూట్ అవుతాడని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది. తప్పకుండా ధనుష్ తో లింగుసామి ఏదో అద్భుతాన్నే చేసేలా ఉన్నాడని చెప్పొచ్చు. తన బయోపిక్ అల్లుడు చేయడంపై రజిని కూడా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. రజిని కూడా తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఓ సాధారణ బస్ కండెక్టర్ నుండి సూపర్ స్టార్ గా అశేష ప్రేక్షక అభిమానాన్ని సాధించిన హీరోగా రజిని జీవిత కథ ఎంతోమందికి స్పూర్తిదాయకం. మరి అలాంటి సూపర్ స్టార్ బయోపిక్ తెర మీద ఎలా ఉంటుందో చూడాలి.