Breaking News

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం


 కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.

మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఐసీయూలో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపాని విచారణకు ఆదేశించారు.