Breaking News

పేటీఎం యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..


 మీరు పేటీఎం ఉపయోగిస్తున్నారా.? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్. ఇకపై వ్యాలెట్ నుంచి బ్యాంక్ ఆకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేటీఎం స్పష్టం చేసింది. గతంలో బ్యాంక్ అకౌంట్‌కు పేటీఎం వ్యాలెట్ నుంచి డబ్బులు బదిలీ చేయాలంటే.. ఎక్స్‌ట్రా ఛార్జీలు పడేవి. ఇకపై ఆ ఛార్జీలను తొలగిస్తున్నట్లు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు.

పేటీఎం వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తున్నప్పుడు మీరు విధించే 5 శాతం ఫీజును తొలగిస్తే ఏమవుతుందని ఓ యూజర్.. సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మను అడగగా.. ఆయన పైవిధంగా సమాధానమిచ్చాడు.

కాగా, క్రిడెట్ కార్డును వ్యాలెట్‌కు డబ్బులు పంపాలనుకుంటే మాత్రం ఎప్పటిలాగే 2 శాతం ఫీజు చెల్లించాలని పేటీఎం పేర్కొంది.