Breaking News

కొత్త నెల రావడంతో కొత్త రూల్స్ కూడా వచ్చేస్తున్నాయి


 నవంబర్ ముగుస్తోంది. డిసెంబర్ వచ్చేస్తోంది. కొత్త నెల రావడంతో కొత్త రూల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రూల్స్ కొన్ని మారుతున్నాయి. ఈ రూల్స్ సామాన్యులను ప్రభావితం చేసేవే. అందుకే ఈ రూల్స్ తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్-RTGS రూల్స్ మారబోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. ఇలా అనేక అంశాల్లో కొత్త నియమనిబంధనలు అమల్లోకి వస్తాయి. మరి అవేంటో తెలుసుకోండి.


RTGS: మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉన్న పద్ధతుల్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సిస్టమ్ ఒకటి. భారీగా లావాదేవీలు జరిపేవారికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది.

డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి.

LPG Cylinder Prices: ప్రతీ నెల మొదటి రోజు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఒకటో తేదీని ప్రకటించిన ధరలే ఆ నెలంతా అమలులో ఉంటాయి. డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై గ్యాస్ సిలిండర్ల ధరలు ఆధార పడి ఉంటాయి.

Indian Railways: భారతీయ రైల్వే ప్రకటించిన స్పెషల్ ట్రైన్స్ చాలా వరకు నవంబర్ 30 వరకే నడుస్తాయి. వీటిపై భారతీయ రైల్వే నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి రైల్వే సేవలపై త్వరలోనే భారతీయ రైల్వే ప్రకటన చేసే అవకాశం ఉంది.