Breaking News

అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు


 తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రంగారెడ్డి జల్లాలోని రావిర్యాల ఫ్యాబ్‌ సిటీ లో 52.56ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలో 48.01ఎకరాలు, చందన్‌వెళ్లిలో 34.21ఎకరాలను టీఎస్‌ఐఐసీ కేటాయించింది.వెబ్‌ సర్వీసెస్‌కు ప్రధానంగా విద్యుత్‌ ఎక్కువగా అవసరం కానుండటంతో 220కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెబ్‌ సర్వీసెస్‌ డాటా సెంటర్లను ఏర్పాటుచేయాలని అమెజాన్‌ నిర్ణయించింది.