Breaking News

అందరినీ కలిపిన తల్లి ప్రేమ


 బిగ్‌బాస్‌ సీజన్‌ 73 రోజులకు చేరుకుంది. షో ముగింపు దగ్గర పడుతుండటంతో ఇంటిసభ్యులు వారి కుటుంబీకులను కలుసుకునేందుకు బిగ్‌బాస్‌ ప్లాన్‌ చేశాడు. కానీ.. కోవిడ్‌ కారణంగా ఒకరినొకరు టచ్‌ చేయడానికి వీలు లేకుండా అడ్డుగోడ కట్టారు. కుటుంబసభ్యులు వారి పిల్లలతో కలిసి తిరగకుండా ఓ గాజు తెరలో నుంచే మాట్లాడే సదుపాయం కల్పించారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోని కొందరు కంటెస్టెంట్లు వారి కుటుంబాలను కలుసుకున్నారు. అఖిల్‌ తల్లి హారిక లాంటి కూతురు కావాలని దేత్తడి మీద ప్రేమ కురిపించింది. దీంతో నామినేషన్‌ గొడవలను గాలికొదిలేసి అంతా ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోయారు బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు.బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అఖిల్‌, అభిజిత్‌, అవినాష్‌, హారిక తల్లులు వచ్చారు.

వాళ్లను చూసి సర్‌ప్రైజ్‌ అయిన ఇంటిసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచే అవకాశం లేకపోయినా మాటలతో ఓదార్చుతూ అద్దంలో నుంచే తమ పిల్లలకు ముద్దులు కురిపిస్తూ ఓదార్చారు.

కుటుంబసభ్యులను కలుసుకున్న కంటెస్టెంట్లు ఆనందంతో గాల్లో తేలియాడుతున్నారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌ చేస్తున్నారు. అటు వచ్చిన కుటుంబసభ్యులందరూ అఖిల్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్తూ అవినాష్‌కు పిల్లను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తానికి బుధవారం నాటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ ఇంటిసభ్యులందరినీ మార్చేసింది. వారి మధ్య ఉన్న గొడవలను తుంచి.. మనస్పర్ధలను చెరిపేసింది. అందరి మనసుల్లో ప్రేమను మాత్రమే వ్యాపింపజేసింది.