Breaking News

మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేదు అనుభవం


 మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. చర్లపల్లి డివిజన్‌లో వరద సహాయం పంపిణీకి మేయర్ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను నిలదీశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని కాలనీ వాసులు మేయర్ బొంతు రామ్మోహన్‌ను నిలదీశారు. వరద సాయం కూడా తమకు సరిగా అందలేదని వారు చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం చెర్లపల్లి డివిజన్‌కు వెళ్లగా.. ఆయనకు ఈ అనుభవం ఎదురైంది.