Breaking News

రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నట్లు టాలీవుడ్ లో మాటలు


 కరోనా వల్ల చాలా సినిమా షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కావడంతో రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నట్లు టాలీవుడ్ లో మాటలు వినిపించాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రాజమౌళి దర్శకత్వం, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. చెర్రీ ఆర్ఆర్ఆర్ మూవీకి సైన్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఆ తర్వాత మరే ఇతర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

పలు దర్శకుల కథలు విన్నట్టు టాక్ వినిపించినప్పటికీ ఇంతవరకు ఏది ఫైనల్ కాలేదు. తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న టాక్ ప్రకారం రాంచరణ్ ఈసారి డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

అప్పుడు రాంచరణ్ హీరోగా చేసిన తొలి చిత్రం చిరుత మూవీని డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ పూరి జగన్నాథ్ - రాంచరణ్ కాంబోలో సినిమా ఓకే అయితే, పదిహేనేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవడం మళ్లీ ఇదే తొలిసారి అవుతుంది. ఇందుకోసం రామ్ చరణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా రానున్న ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్‌కి పరిచయం అవుతుండగా అనన్యా పాండే టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.