Breaking News

'సూపర్ కాంపాక్ట్' పవర్ బ్యాంక్‌..


 ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ Xiomi సరికొత్త సూపర్ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ను విడుదల చేయనుంది. ఎంఐ పవర్ బ్యాంక్ 3 అల్ట్రా కాంపాక్ట్ పేరుతో వచ్చే ఈ పవర్ బ్యాంక్ ని నవంబర్ 5న భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు Xiomi సంస్థ ప్రకటించింది. రాబోయే ఎంఐ పవర్ బ్యాంక్ Xiomi సంస్థకు చెందిన అత్యంత కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌గా నిర్ణయించబడుతోంది. అంతేకాక, జేబులో సులభంగా ఇమిడేలా దీన్ని రూపొందించారు. తద్వారా దీన్ని ఎక్కడికైనా సులభంగా క్యారీ చేయవచ్చు. కాగా, Xiomi సంస్థ సెప్టెంబర్లో 10,000 ఎంఏహెచ్, 20000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో ఎంఐ 3ఐ వైర్లెస్ పవర్ బ్యాంక్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే మరో కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌ను భారత మార్కెట్కి పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.


ప్రస్తుతం ఎంఐ, రెడ్‌మి బ్రాండ్ల క్రింద భారతదేశంలో అనేక పవర్ బ్యాంకులను కలిగి ఉన్న Xiomi పవర్ బ్యాంకులు సాధారణంగా పొడవుగా ఉంటాయి.


ఎంఐ పవర్ బ్యాంక్ 2, ఎంఐ పవర్ బ్యాంక్ 3 లైనప్‌లలో ఇది వరకే విడుదలైన అనేక ఎంఐ పవర్ బ్యాంకులు కనిష్టంగా 12 సెంటీ మీటర్ల పొడవుతో వచ్చాయి. ఇది దాదాపు 5 -అంగుళాల డిస్ప్లే కలిగిన సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువ పొడవు అని చెప్పవచ్చు. కానీ నూతనంగా విడుదల కానున్న సూపర్ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ మాత్రం తక్కువ పొడువుతో జేబులో పట్టేలా రూపొందించడం విశేషం. Xiomi నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న ఈ పవర్ బ్యాంక్ వివరాలను ఎంఐ ఇండియా ట్వీట్ చేసింది. నూతనంగా రాబోయే సూపర్ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ ను అత్యంత శక్తివంతమైన పవర్‌హౌస్ గా పేర్కొంది షిమోమి సంస్థ. స్పెసిఫికేషన్స్


ఎంఐ పవర్ బ్యాంక్ 3 అల్ట్రా కాంపాక్ట్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తోందని Xiomi పేర్కొంది. పవర్ బ్యాంక్ ఇన్పుట్ కోసం మైక్రో-యుఎస్బి, యుఎస్బి టైప్-సి పోర్టులను కలిగి ఉంది. అవుట్పుట్ కోసం, రెండు యుఎస్బి టైప్-ఎ పోర్టులు కూడా ఉన్నాయి. ఇది 200 గ్రాముల బరువు, 9x6.4x2.4 సెం.మీ. డైమెన్షన్తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుందని, ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభించిన ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ మాదిరిగానే దీని స్పెసిఫికేషన్స్ ఉంటాయని Xiomi తెలిపింది. ఈ పవర్ బ్యాంక్ టైప్-సి, టైప్--ఎ పోర్టుల ద్వారా 22.5W అవుట్పుట్ పవర్ ను అందిస్తుంది. అయితే, ప్రస్తుతానికి, దీని ధర వివరాలను మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు Xiomi సంస్థ.


కాగా సెప్టెంబర్ నెలలో రెండు వేరియంట్లలో ఎంఐ పవర్ బ్యాంక్ 3i రెండు వేరియంట్లలో పవర్ బ్యాంక్లను విడుదల చేసింది షియోమి. వీటిని 10,000mAh, 20,000mAh సామర్థ్యాలతో లాంఛ్ చేసింది. ఈ రెండు Xiomi పవర్ బ్యాంకులు కూడా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 20,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర రూ. 1,399 ఉండగా, 10,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర రూ. 6,999గా ఉంది. కాగా,10,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఎంఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో దీని ధర రూ. 2,499 గా ఉంది.