Breaking News

అందరికీ భారీ షాక్ ఇచ్చిన శ్రీరెడ్డి


 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి కొన్నాళ్ళ క్రితం దానిని ఎంతో వివాదాస్పదం చేసిన వర్ధమాన నటి శ్రీ రెడ్డి ఒకానొక సమయంలో తనపై కాస్టింగ్ కోచ్ ప్రభావం ఏర్పడిందని అయినప్పటికీ కూడా తన వలే తోటి అమ్మాయిలు ఆ విధమైన వేధింపులకు గురి కాకూడదని తాను క్యాస్టింగ్ కౌచ్ ఈ అంశాన్ని బయటపెట్టినట్లు చెప్పుకొచ్చారు శ్రీరెడ్డి. ఇక ఆ తర్వాత ఒకానొక సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీ రెడ్డి ఎట్టకేలకు వారి నుండి టాలీవుడ్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం అనే స్పందన రావడంతో దానిని విరమించింది.


ఆ తర్వాత పలు డిబేట్స్ తో పాటు మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ రెడ్డి , చిత్ర పరిశ్రమలో చాలా వరకు మంచి వ్యక్తులు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొందరు చీడపురుగులు మాత్రం ఈ కాస్టింగ్ కౌచ్ పేరుతో కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.


అయితే ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మహిళల కోసం ప్రత్యేకంగా వింగ్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ ఈ సంఘటనల అనంతరం శ్రీ రెడ్డికి పాపులారిటీ బాగా పెరిగింది. అయితే ఆ పై ఒకానొక సమయంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైంది.


ఆ తర్వాత కొన్నాళ్లకు చెన్నై కి తన మకాం మార్చిన శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాద్యమం ఫేస్బుక్ ద్వారా అభిమానంతో ముచ్చటిస్తూ అక్కడక్కడా కొందరు సినిమా నటులపై తనదైన స్టయిల్ లో విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. అయితే ఆ విధంగా ఫైర్ బ్రాండ్ గా పేరున్న శ్రీరెడ్డి ఇటీవల కొన్నాళ్లుగా మాత్రం అందరికీ భారీ షాక్ ఇస్తూ ప్రశాంతమైన సాధు స్వభావంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం దసరా సందర్భంగా అమ్మవారి మాల స్వీకరించిన శ్రీ రెడ్డి అప్పటినుండి పలువురు ఇతర నటులపై ఎటువంటి ఆరోపణలు చేయకుండా తన వ్యక్తిగత విషయాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు తెస్తూ పంచుకుంటోంది. అయితే శ్రీరెడ్డి లో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు పై కొందరు అభిమానులు షాక్ అవుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!