Breaking News

మెట్రో ప్రయాణికులకు శుభవార్త...


 ఢిల్లీ మెట్రోలో ఈరోజు నుంచి ప్రయాణికులకు మరో నూతన సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెట్రో స్టేషన్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో వెయిటింగ్ టైమ్ గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ కోసం 20 నిముషాల కన్నా అధిక సమయం వెయిట్ చేయాల్సి వచ్చినపుడు ఆ వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయనున్నారు.


ఇది ప్రస్తుత కోవిడ్-19 సమయంలో ప్రయాణికులు కరోనా ప్రొటోకాల్ పాటించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీకి పరిష్కారం లభిస్తుందన్నారు. డీఎంఆర్సీ హ్యాండిల్‌పై ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మొత్తం 10 స్టేషన్లలో వెయిటింగ్ టైమ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారు.