Breaking News

బిగ్ బాస్ షాకింగ్ సర్వే...?


 బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఈసరి ఎవరు విజేత అవుతారు అన్నది ఇపుడు టెన్షన్ పెట్టే మ్యాటర్ గా ఉంది. హౌజ్ లోకి ఈసారి అంతా కొత్తవారు గా వచ్చినా ఇపుడు చాలా మంది హౌజ్ మేట్స్ ఆడియన్స్ కి హాట్ ఫేవరేట్ అయిపోయారు. తన అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఎవరికి వారు గట్టిగానే కోరుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ లో ఈసారి కొత్త రికార్డ్ గానే టైటిల్ విన్నర్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.


అదేంటి అంటే హడావుడి ఎక్కువగా చేయకుండా ఉత్తదానికే ఎమోషన్ అయి స్క్రీన్ షేర్ కోసం పోటీ పడకుండా చాలా సైలెంట్ గా ఉంటూ తన గేమ్ మాత్రమే తాను ఆడుతున్న అభిజిత్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అని అంతా ఓటేస్తున్నారు. దీని మీద ఒక సర్వే కూడా జరిగిందని తెలిస్తే అది షాకింగే మరి.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ ఎవరూ అని జరిగిన సర్వేలో అభిజిత్ అని దాదాపుగా అరవై శాతం మంది చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు.

ఇక అభిజిత్ తరువాత చూసుకుంటే సోహెల్ తప్ప మిగిలిన కంటెస్టెంట్లు అందరూ చూసినా ఏ ఒక్కరూ పది శాతం మించి రాబట్టుకోలేకపోయారు. బిగ్ బాస్ లో అరుపులు కేకలతో హుషారెత్తించిన సోహెల్ అయితే 11 శాతం మాత్రం ఓట్లు తెచ్చుకున్నారు. ఇక మిగిలిన వారు అంతా చాలా తక్కువగానే ఉన్నారు.

దీన్ని బట్టి చూస్తే హౌజ్ లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాని అభిజిత్ ఏకంగా టైటిల్ విన్నర్ కావడం అంటే అది గ్రేటే మరి కెప్టెన్ కావాలంటే హౌజ్ మేట్స్ సపొర్ట్ కావాలి. అభిజిత్ అలా ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. తన గేమ్ తాను ఆడుతున్నాడు కాబట్టే అతను బయట జనాల మద్దతు తీసుకున్నాడని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే బిగ్ బాస్ లో ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అని సర్వే రిజల్ట్ గట్టిగానే చెబుతోంది.