Breaking News

నన్ను చాలా మంది ప్రేమించారు...


 బిగ్ బాస్ ఫేమ్ హిమజ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా హిమజ మాట్లాడుతూ తన ప్రేమకథల గురించి చెప్పింది. తనను చాలామంది లవ్ చేశారని, తాను కూడా చేశానని నిర్మోహమాటంగా చెప్పేసింది.


అయితే ఇప్పుడు మాత్రం ఎవరి జీవితం వాళ్లదని చెప్పేసింది. దాన్ని బ్రేకప్ అని చెప్పి వాల్యూ తీసుకోలేం కానీ.. ఒక్కసారి లవ్ చేశాం అంటే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందని హిమజ ఎమోషనల్ అయింది.

తన హార్ట్‌లో చాలా మంది ఉన్నారని, కొంతమంది మనసులో అలా ఉండిపోతారని హిమజ ఎమోషనల్ అయింది. ఎనిమిదో తరగతిలోనే ఒకర్ని లవ్ చేశానని, అతను ఇప్పటికీ హార్ట్‌లో అలా ఉండిపోయాడని హిమజ తెలిపింది. అయితే తన ప్రేమ కథ గురించి చెబితే ఓ యూట్యూబ్ చానెల్ వాళ్లు వ్యూస్ కోసం వేరే హెడ్డింగ్ పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది.