Breaking News

పవన్ మళ్ళీ పాత లుక్


 రీసెంట్ గా "వకీల్ సాబ్" షూట్ కు గాను పవన్ మళ్ళీ పాత లుక్ లోకి వచ్చారు. షూట్ లో కూడా పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఆ లుక్ కూడా మార్చేశారు. వకీల్ సాబ్ కు ట్రిమ్డ్ లుక్ లో ఉన్న పవన్ ఇప్పుడు క్లీన్ షేవ్ లోకి రావడంతో తాను ఈ చిత్రంతో పాటుగా క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ను కూడా లైన్ లో పెట్టారు. కానీ దాని కోసం మాత్రమే క్లీన్ షేవ్ లుక్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఆ లుక్ లోకే మారడంతో అదే సినిమా కోసం అని అనుకోవచ్చు కానీ "వకీల్ సాబ్" లో ఇంకా బ్యాలెన్స్ షూట్ కాస్త మిగిలి ఉంది.ముఖ్యంగా పవన్ మరియు శృతి హాసన్ లపై సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి బహుశా అందుకోసమా లేక క్రిష్ తో సినిమా కోసమా అన్నది తెలియాల్సి ఉంది.